PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

 విశాఖలో తనకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో పీవీ సింధు అకాడమీకి సింధు శంకుస్థాపన చేశారు. తన తల్లితండ్రులతో కలిసి విశాఖకు వచ్చిన సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒలింపిక్స్ లో పతకం గెలిచిన సందర్భంగా ఏపీ ప్రభుత్వం సింధుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు స్థలం కూడా కేటాయించింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో స్థలం కేటాయించగా.. దాన్ని జగన్ ప్రభుత్వం విశాఖకు మార్చింది.  అయితే ఆ స్థలాన్ని జూనియర్ కళాశాలకు కేటాయించాలంటూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. సింధు రాక సందర్భంగా ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టగా పోలీసులు వారి అడ్డుకున్నారు. తనకు కేటాయించిన స్థలంలో సింధు అకాడమీ కోసం శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పూర్తి చేసి తన లాంటి ఎంతో మంది ప్లేయర్లను తీర్చిదిద్దుతానని ఆశాభావం వ్యక్తం చేశారు సింధు. తనలానే గేమ్ అంటే తపనపడే చిన్నారులకు ఈ అకాడమీ ఆలోచన ఉపయోగపడుతుంది అన్నారు పీవీ సింధు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola