Kadapa: పుల్లంపేట వాసులను అందరు శభాష్ అంటున్నారు. ఎందుకంటే..
మానవత్వం పరిమళించిన వేళ, వరద కన్నా వేగంగా స్పందిస్తున్న దాతలు. మేము ఉన్నామంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న సామాన్య ప్రజలు.వరద బాధితులను ఆదుకునేందుకు కడప జిల్లా ,పుల్లంపేట గ్రామ ప్రజలు మేము సైతం అంటూ ముందు కు కదిలారు. వరద బాధిత ప్రాంతమైన పులపత్తూరు లో బాధితులకు కావాల్సిన సామగ్రి సమకూర్చారు. పుల్లంపేట ప్రజలు చేసిన ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజల్లో అనూహ్య స్పందన రావడంతో పాటు పుల్లంపేట ప్రజలను వహ్వా అని అందరూ మెచ్చుకుంటున్నారు.