ప్రకాశం బ్యారేజ్‌కు పెను ప్రమాదం ఎదురైందా.?
విజయవాడలోని ఫెర్రీ నుంచి వరద ఉద్దృతికి కొట్టుకువచ్చిన మూడు బోట్లు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడం ఆందోళనను కలిగిస్తోంది. మూడు పడవల్లో ఓ పడవ బలంగా ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది దీంతో బ్యారేజీపైన వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటీ..బోట్లు ప్రకాశం బ్యారేజ్ ను ఎలా ఢీకొట్టాయి ఈ వీడియోలో. ఇంత పెద్ద ఇన్ ఫ్లో ఎప్పుడూ రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎప్పుడో 1998లో ఈ తరహా వరద వచ్చిందని తెలిపారు. 1998లో 9.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఇప్పుడు ఏకంగా 9.70 లక్షల క్యూసెక్కులు వచ్చిందని పేర్కొన్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు 50 వేల క్యూసెక్కుల నీరు అధికంగా వచ్చిందని లెక్కలు చూపించారు. కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న అన్ని రిజర్వాయర్లు నిండాయని క్లారిటీ ఇచ్చారు. బుడమేరుకు వరద నీరు ఎక్కువగా రావడంతో సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోకి నీళ్లు వచ్చాయని తెలిపారు.