Political Parties on Hanuma Vihari Issue : రాజకీయం సంతరించుకున్న హనుమ విహారీ వివాదం | ABP Desam
ఆంధ్రా మాజీ కెప్టెన్, టీమిండియా ఆటగాడు హనుమ విహారికి, ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ కు మధ్య ఏర్పడిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ కార్పొరేటర్ కోసం టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన విహారికి అన్యాయం చేయటం సిగ్గు చేటంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు.