Police Jeep Robbed: ఒడిశా పోలీసుల జీప్ తో పరారైన రాజమండ్రి యువకుడు
తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని, ఓ యువకుడు వారి వాహనంతోనే పరారయ్యాడు. రాజమండ్రికి చెందిన యువకుడు.... ఒడిశాలోని శంబల్ పూర్ లో ఉంటున్నాడు. రాయగడలో ఓ ఆలయ దర్శనానికి వచ్చాడు. అక్కడ కొందరు తనపై దాడి చేసి డబ్బు, ఫోన్ లాగేసుకున్నారని చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే వారి వాహనాన్ని తీసుకొచ్చేసినట్టు చెబుతున్నాడు. పార్వతీపురంలో ఒడిశా పోలీసుల జీప్ తో అతణ్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు.