Police Case on Fighting at Free Bus | జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లో తొలి కేసు నమోదు | ABP Desam

 స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా..కొన్ని చోట్ల ఇలా మహిళలు కొట్లాటకు దిగుతున్నారు.  విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే బస్సులో నాలుగు రోజుల క్రితం మహిళల మధ్య ఓ గొడవ జరగగా అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బస్సు లో సీటు విషయమై ఇద్దరు మహిళల మధ్య మాటా మాటా  పెరిగి జుట్టు పట్టుకుని పోట్లాడుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన ఘటనలో బాధితులు..దాడి చేసిన వాళ్లు ఇద్దరితోనూ మాట్లాడిన జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత రిజిస్టర్ అయిన మొదటి కేసు ఇది. గతంలో కర్ణాటక, తెలంగాణల్లోనూ ఇదే తరహాలో ఫ్రీ బస్సుల్లో సీటు కోసం మహిళలు పోట్లాడుకున్న ఘటనలు జరిగాయి. అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బస్సు ఉచితమని చెప్పటంతో మహిళల నుంచి ఆర్టీసీకి  బాగా రద్దీ పెరిగింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola