Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

Continues below advertisement

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణం సాదిక్ ఖాన్.   కాకినాడలో  ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ  నిర్వాహకుడిగా క్రీడాకారుడి ముసుగు వేసుకున్న షేక్ సాధిక్ ఖాన్ వెనుక అత్యంత ప్రమాదకరమైన నేరపూరిత ప్రవర్తన ఉంది.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి సౌత్ ఇండియాలోనే ఏకైక అకాడమీ నడుపుతున్నానంటూ చలామణి అయిన ఇతడు, తెరవెనుక ఒంటరి మహిళలను, కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీవ్ర బెదిరింపులకు, ఆర్థిక దౌర్జన్యాలకు పాల్పడే రాక్షసుడు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో పిఠాపురం ఏఈ నూకరాజు అల్లుడు మరణించడాన్ని సాధిక్ ఖాన్ తన వికృత చేష్టలకు అవకాశంగా మలుచుకున్నాడు.   ఏఈ కుమార్తె సౌజన్యకు అండగా ఉంటానని నమ్మించి లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె, ఆమె కుటుంబం ఇతడి ప్రతిపాదనలను నిరాకరించేసరికి చిన్నారి మనవడిని, ఏఈ నూకరాజును చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. వారి బ్యాంకు ఖాతాలను, విలువైన వస్తువులను, ఆస్తులను బెదిరించి తన అదుపులోకి తీసుకుని తీవ్రమైన భయాందోళనలకు గురిచేశాడు. ఇవన్నీ ఏఈ నూకరాజు రాసిన మరణవాంగ్మూలంలో ఆధారాలతో సహా బహిర్గతమైంది.

ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి తన భార్య, కుమార్తె, మనవడితో సహా గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత తీవ్రమైన మానసిక నరకాన్ని సాధిక్ ఖాన్ చూపించాడు. ఇతడి బ్లాక్‌మెయిలింగ్, లైంగిక, ఆర్థిక వేధింపుల దాడిని తట్టుకోలేకనే ఒక అమాయక కుటుంబం బలవన్మరణానికి సిద్ధపడాల్సి వచ్చింది.  ఇలా చాలా మందిని వేధించి ఉంటాడని.. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సాదిక్ ఖాన్ లవ్ జీహాద్ కోణంలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అన్నదానిపైనా పోలీసులు ఆరా తీయాలని పలువురు కోరుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola