Pinnelli Ramakrishna Reddy Breaks EVM Machine | EVM ధ్వంసం ఓ చిన్న సంఘటన అంతే

మాచర్లలో ప్రజాబలంతో 4 సార్లు గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఒక్క ఈవీఎం ధ్వంసం ఘటనను చూపి ఎల్లోమీడియా ఆయనపై దుష్ప్రచారం చేస్తోందని కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

 

మాచర్లలో ప్రజాబలంతో 4 సార్లు గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఒక్క ఈవీఎం ధ్వంసం ఘటనను చూపి ఎల్లోమీడియా ఆయనపై దుష్ప్రచారం చేస్తోందని కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి న్యాయపరమైన అవకాశాలను వెదుక్కుని ఉంటే.. వైసీపీకి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండేది. కానీ పరారు కావడం వల్ల ఎలాంటి వాదన వినిపించినా ప్రజల్లోకి మాత్రం భిన్నంగా వెళ్తోంది. పార్టీ ముఖ్య నేతలందరూ హాలీడే మూడ్ లో ఉండటంతో పిన్నెల్లి ఇష్యూని సరిగ్గా డీల్ చేయలేకపోయినట్లుగా మారింది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు తప్పు దిద్దుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అరెస్టు చేయాల్సింత కేసు కాదని ఆయన చెప్పదల్చుకున్నారు. కానీ చెప్పే విషయంలో తేడా రావడం.. అప్పటికే పిన్నెల్లి పారిపోయారని ఉద్ధృతంగా ప్రచారం జరగడంతో కాసు మహేష్ రెడ్డి వాదన కూడాచాలా మందికి వింతగా అనిపించింది. అలాగే  మంత్రి అంబటి రాంబాబు ఆ వీడియో ఫేక్  కావొచ్చునని వాదించి మరింత విమర్శలకు గురయ్యేలా చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola