Perni Nani Counter To JP Nadda: చెప్పుడు మాటలు విని స్క్రిప్ట్ బట్టి కొట్టారన్న పేర్ని నాని
శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయని, కుదిరితే నడ్డా వాటికి సమాధానం చెప్పుకోవాలని హితవు పలికారు.