MLA Nimmala Ramanaidu: కైలాస రథం నడిపి ఆదర్శంగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన పని పలువురికి ఆదర్శంగా నిలిచింది. అవసరం వస్తే ఏ క్షణంలో ఎలాగైనా మారి సేవలు అందించాలని నిరూపించారు. శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథం డ్రైవర్‌కు కరోనా సోకగా.. వాహనాన్ని నడిపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా తీసుకెళ్లారు. డ్రైవర్‌గా మారి కైలాస రథం నడిపిన ఆయన, తనకు ఈ అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.