Pawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
నిన్న తిరుపతి స్విమ్స్ లో పవన్ కళ్యాణ్, జగన్ ఎదురెదురు పడ్డారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రులను పరామర్శించటానికి ఈ ఇద్దరు నేతలు రావటం అది కూడా ఒకే సమయంలో ఒకే ప్రాంగంణంలో ఉండటం పొలిటికల్ హీట్ ను పెంచితే..పోలీసులకు మాత్రం మాములు తలనొప్పి కాదు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. జగన్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే. వైసీపీ, జనసేన పార్టీల అధినేతల ఈ ఇద్దరూ తిరుపతి స్విమ్స్ లో ఎదురుపడటం..పోలీసుల్లో అయితే పిచ్చ టెన్షన్ నింపింది.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ దగ్గర అంత మంది పోలీసులు కూడా లేరు. కారణం అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఏడీ బిల్డింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ టైమ్ లో సీఎం ప్రెస్ మీట్ కూడా జరుగుతూ ఉంది. దీంతో ఉన్న పోలీసులనే పవన్ కళ్యాణ్, జగన్ బందోబస్తుకు సర్దారు. పవన్ కళ్యాణ్ క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కొనసాగించే పరిస్థితులు అక్కడ కనిపించలేదు. రెండు పార్టీల కార్యకర్తలు చేస్తున్న రచ్చకు పోలీసులు వద్దన్నట్లు చెప్పేశారు పవన్ కు.
స్విమ్స్ లో పవన్ మాట్లాడుతుండగానే జగన్ స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చేశారు. వైసీపీ ఫ్యాన్స్ , జగన్ అభిమానులు ఎంత హడావిడి చేశారంటే వాళ్లు అరిచిన అరుపులకు పవన్ కళ్యాణ్ చాలా సార్లు ప్రసంగంలో డిస్ట్రబ్ అయ్యారు. ఏంటా గొడవ అని కూడా అడిగితే..పక్కనున్న వారు జగన్ మోహన్ రెడ్డి వచ్చారు అని చెప్పారు.