Pawan Kalyan To be Deputy CM | డిప్యూటీ సీఎంగా పవన్.. రేపే ప్రమాణస్వీకారం | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPawan Kalyan To be Deputy CM | మరికొన్ని గంటల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ ఫ్యాన్స్ ఓ క్రేజీ వీడియో వైరల్ చేస్తున్నారు. అదే..బాహుబలి -2లో పట్టాభిషేకం సీన్. అందులో రాజుగా భళ్లాలదేవ పట్టాభికేషం చేస్తున్నప్పటికీ.. అమరేంద్ర బాహుబలి అనే నేను అనే సరికి..మొత్తం ఆ ప్రాంగణమంతా షేక్ అవుతుంది. గుర్తుంది కదా ఈ సీన్. సేమ్.. ఇదే సీన్ రేపు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనుభవజ్ఞుడు, నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నప్పటికీ... పవన్ కల్యాణ్ అనే నేను డైలాగ్ వినపడగానే ఆ ప్రాంగణం అంతా ఊగిపోవాల్సిందేనని అంటున్నారు. నార్మల్ సినిమా ఫంక్షన్లలోనే పవన్ మాట్లాడుతుంటే.. కొన్ని నిమిషాల పాటు ఏమి వినబదగు కేవలం ఫ్యాన్స్ కేరింతలే ఉంటాయి. అలాంటింది...తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో తమ అభిమాన నేత ప్రమాణస్వీకారం చేస్తున్నారు అంటే పవన్ ఫ్యాన్స్ ఆగుతారా..? అందులోనూ మోదీ కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. సో.. ఈ సారి పవన్ ఫ్యాన్స్ తఢాఖా చూపిస్తే దిల్లీ స్థాయిలో వినబడాలి అంటూ జనసైనికులు ఈ బహుబలి రెఫరెన్స్ గు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.