Pawan kalyan Opening Ram Koniki Salon Koniki | సెలూన్ షాప్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ | ABP Desam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ కానూరు రోడ్డులో ఓ సెలూన్ షాప్ ఓపెన్ చేశారు. తన హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొనికి విజయవాడలో ఏర్పాటు చేసిన సెలూన్ కొనికి ని ఓపెన్ చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావటంతో కానూరు రోడ్డులో సందడి వాతావరణం నెలకొంది. ఓజీ సినిమా షూట్ కోసం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్...జాగింగ్ పూర్తి చేసుకుని స్పోర్ట్ డ్రెస్ లో షాప్ ఓపెనింగ్ కి వచ్చేశారు. టీ షర్ట్ , షార్ట్స్ తో ఎప్పుడూ చూడని గెటప్ లో ఉన్న పవన్ ఫోటోలు కాసేపటికే వైరల్ అయ్యాయి. తన సినిమాలకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసే రామ్ కొనికి చేసిన రిక్వెస్ట్ తోనే పవన్ తన వర్కవుట్స్ టైమ్ లోనే ఇటుగా వచ్చి సెలూన్ ను ప్రారంభించి బోణీ చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెలూన్ ఓపెన్ చేయటంపై వైసీపీ ట్రోలింగ్ చేస్తోంది. గతంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను న్యూడిల్స్ బండి ఓపెన్ చేశారంటూ ట్రోల్ చేశారని ఇప్పుడు డిప్యూటీ సీఎం సెలూన్ షాప్స్ ఓపెన్ చేసి రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ తెచ్చారంటూ వెటకారం చేస్తున్నారు. సాధారణంగా పార్టీలకు, ఫంక్షన్లకు అటెండ్ అవ్వటాన్ని ఇష్టపడని పవన్ కళ్యాణ్ తన దగ్గర పనిచేసే మనిషి కావటంతో వచ్చారని...దాన్ని వైసీపీ ట్రోల్ చేయటంపై జనసేన కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది.