Pawan Kalyan on Hindi Big Mother | ఉత్తరాది ప్రజలు దక్షిణాది భాషలు నేర్చుకుంటే బాగుంటుంది | ABP

 హిందీ ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తున్నా. భాష నేర్చుకోవటం ఎప్పుడైనా మంచిదే. నేను ఏమన్నా మాట్లాడాలంటే తెలుగు, ఇంగ్లీషుల్లోనే వస్తుంది. నేను హిందీ కూడా రావాలని కోరుకుంటున్నా. నేను హిందీ రాయగలను, చదవగలను కానీ మాట్లాడేప్పుడు కొంచెం ఇబ్బంది. నా మీద నాకు కోపం. నేను హిందీ నేర్చుకునుంటే నేను బాగా మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు ఇంగ్లీషులోనే హిందీ కంటే బాగా మాట్లాడుతున్నా. నేను హిందీ ఇంకా నేర్చుకోవాలి. నాకు టైమ్ ఉండటం లేదు. మాట్లాడే వాళ్లు లేరు. అవసరం పడటం లేదు. పైగా నేను తెలుగు సినిమాకే పరిమితమైపోయా. నేను కొత్త భాష నేర్చుకుంటే అది నా కెరీర్ కే ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడేవాళ్లు ఉన్నప్పుడు ఆ భాష నేర్చుకోవటం అవసరం. అలాగే ఉత్తరాది ప్రజలు కూడా దక్షిణాది భాషలు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. హిందీ మాట్లాడే ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంలో ఆ భాష నేర్చుకుంటే తప్పేంటన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఏబీపీ తో మాట్లాడిన పవన్ కళ్యాణ్..హిందీ భాషను ఎందుకు పెద్దమ్మ అన్నారో చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola