Pawan Kalyan MLA Oath taking | ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం | ABP Desam

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. పిఠాపురం నుంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్న 2014 పార్టీ పెట్టినా ఇంత వరకు ఆయన విజయం సాధించలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2024 పిఠాపురం నుంచి పోటీ చేసి దిగ్విజయం సాధించారు. ఎమ్మెల్యేగానే కాకుండా డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రిగా కూడా నియమితులయ్యారు. జనసేన, భాజపాతో కలిసి 164 స్థానాలతో చరిత్రలో లేని విజయం సొంతం చేసుకుని, జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం లేకుండా చేసి సింహంలా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు చంద్రబాబు. అయితే తాను జైలులో ఉన్న సమయంలో తనకు జనసేన అధినేత పవన్ అండగా నిలిచిన తీరుని చంద్రబాబు మరువలేదు.  ఇప్పటికీ చంద్రబాబు పలు సందర్భాల్లో పవన్ తనకు, పార్టీకి నైతిక స్థైర్యం ఇచ్చిన సంగతి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తరువాత సైతం ఆయనకు తన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. అంతే కాకుండా తన ఫొటోతో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ పవన్ ఫొటో కూడా ఉండాలని ఆదేశించి తన మనసులో పవన్ స్థానమేంటో చూపించారు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola