Pawan Kalyan Meets Nara Bhuvaneswari: రాజమండ్రిలో భువనేశ్వరిని కలిసిన పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ ములాఖత్ అయ్యారు. పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేసిన తర్వాత.... నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో కలిసి నారా భువనేశ్వరిని కలిసేందుకు వెళ్లారు. రాజమండ్రిలో మొన్న తన భర్తను ములాఖత్ లో కలిసిన తర్వాత ఆమె, బ్రాహ్మణి నగరంలోనే నివాసముంటున్నారు. వారు ఉన్న గెస్ట్ హౌస్ కు పవన్ చేరుకున్నారు. అరెస్ట్, రిమాండ్ పరిణామాలపై మాట్లాడి వారిని పరామర్శించారు. అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఈ మధ్య నారా లోకేష్ ఓ ప్రెస్ మీట్ లో పవన్ ను తన అన్నయ్యగా సంబోధించిన విషయం తెలిసిందే.