Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

Continues below advertisement

 వ్యవసాయ కూలీలు ప‌నులు ముగించుకుని ఇంటికి వ‌చ్చి సేద‌తీరుతున్న స‌మయం అది.  ఆదివారం కూడా కావ‌డంతో ఊరంత‌టికి ఒకే ఇంటిలో ఉన్న టీవీలో దూరదర్శన్ లో వ‌చ్చే సినిమా చూస్తూ ఉన్నారు గ్రామస్తులు.  చంటి పిల్లలకు స్నానాలు చేయిస్తూ కొందరు...పొలం పనుల నుంచి తిరిగొస్తున్న మరికొందరు...సాయంత్రం 6గంటల 50 నిముషాలు కాగానే గుండెల‌దిరేలా భీక‌ర శబ్దంతో ఓ విస్పోట‌నం జరిగింది. క‌ళ్లు ఎత్తిచూడ‌లేనంత ఎత్తుకు ఎగిసిప‌డుతున్న భీక‌ర అగ్ని కీల‌లు.. ఏం జ‌రిగిందో తెలియ‌ని ప‌రిస్థితి.. కట్టుబట్టలతో అలానే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప‌రుగులు పెట్టిన ప్రజలు..ఇదంతా 1995 జనవరి 8 సాయంత్రం జరిగిన ఘటన.  అప్పటి తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండ‌లం బోడ‌స‌కుర్రు గ్రామ ప‌రిధిలోని దేవ‌ర్లంకలో సంభ‌వించిన బ్లో అవుట్ మిగిల్చిన భయం నేటికి స్థానికులను వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉంటుంది. ఏకంగా 65రోజుల పాటు మండిన మంటలు...ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో అవుట్ గా పాశర్లపూడి బ్లో అవుట్ ఘటనను నిలబెట్టాయి. నాటి ఘటన జరిగిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది..అక్కడి ప్రజలు 30ఏళ్ల నాడు జరిగిన బ్లో అవుట్ పై ఏమంటున్నారు..పాశర్లపూడి ఘటన పై ABP Desam Exclusive Ground Report

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola