Paritala Sunitha Paadayatra: రైతులకు న్యాయం చేయాలని పరిటాల సునీత డిమాండ్
అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేపట్టారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసినట్టు ఆమె తెలిపారు. వరదలకు రైతులు పంటలను పూర్తిగా నష్టపోయారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పంట బీమా కూడా అందరికీ అందట్లేదని ఆరోపించారు.