Paritala Sunitha Deeksha: ఉదయాన్నే దీక్ష భగ్నం చేసిన పోలీసులు, కానీ నిన్న రాత్రి ఏం జరిగింది.?
అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత దీక్షా శిబిరం వద్ద నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం దాకా హైడ్రామా నడిచింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతికేరంగా సునీత అక్కడ దీక్ష చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దీక్షా శిబిరం ఫొటోలు తీసేందుకు, రెక్కీ చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించినట్టు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ రాత్రి సమయంలోనే వైసీపీ నేతల వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టి యాక్సిడెంట్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ ఉదయం పరిటాల సునీత దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆమెను, తోడుగా ఉన్న మహిళా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.