Ongole Police Mock Drill | ఒంగోలులో అల్లర్లు, హింసాత్మక ఘటనలు..ఏమైందంటే.? | ABP Desam

Continues below advertisement

ఒంగోలులో ఉన్నపళంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున వీధుల్లోకి ఆందోళన కారులు చొచ్చుకు వచ్చారు. పోలీసులు వచ్చినా వాళ్ల నిరసన ఆపలేదు. అంతటితో ఆగకుండా రాళ్ల దాడులు చేశారు. పెట్రో బాంబులు విసురుతూ ఉద్రిక్త పరిస్థితులను క్రియేట్ చేశారు. ఇక పోలీసులు ఊరుకోలేదు. లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. వాటర్ కేనన్స్ ఉపయోగించి గొడవ చేస్తున్న వారిని చెదరగొట్టారు. అప్పటికీ ఊరుకోకుండా ఆందోళనకారులు రాళ్ల దాడులు చేయటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదంతా అందరూ చూస్తుండగానే జరగటంతో ఒంగోలు వాసులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఇదంతా పోలీసులు మాక్ డ్రిల్. వచ్చే నెల 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందిస్తామో అర్థమయ్యేలా పోలీసులు వివరించారన్న మాట. ఓరకంగా పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంటుంది సో ఆందోళనలు చేయాలనుకున్న వాళ్లు ఇప్పటికైనా ఆ ఆలోచనలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారన్నమాట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram