Nuvvalarevu Weird Marriage: నువ్వలరేవు... రెండేళ్లకోసారి మాత్రమే పెళ్లిళ్లు చేసే వింత గ్రామం
Continues below advertisement
ఇది శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామం. కాలం వేగంగా మారుతున్నా... ఆచార సంప్రదాయాలకే ప్రాధాన్యమిచ్చే ఊరు ఇది. జిల్లాలోనే అతి పెద్ద మత్యకార గ్రామమైన నువ్వలరేవులో ఆచారాలు, కట్టుబాట్లకు గ్రామస్తులు పెద్దపీట వేస్తారు. దాదాపు 15 వేలమంది జనాభా ఉన్నా ఈ ఊళ్లో ఎన్నో ఏళ్లుగా ఓ భిన్నమైన ఆచారం ఉంది. అదే సామూహిక వివాహాలు జరిపించడం. అవును... నువ్వలరేవులో ప్రతి మూడేళ్లకోసారి అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరుగుతుంటాయి.
Continues below advertisement