NTR Statue Painted With YCP Colors: బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి YCP రంగులు వేయడంపై TDP ఆగ్రహం

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు బొమ్ములూరుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేశారు. వైసీపీ రంగులపైనే పసుపు రంగు వేశారు. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola