Nitish Kumar Reddy Craze in Tirumala | నితీశ్ తో ఫోటోలు దిగాలని తిరుమలలో ఫ్యాన్స్ పోటీ | ABP Desam

Continues below advertisement

 ఒక్క అవకాశం..ఒకే ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. అలాంటి అవకాశం నితీశ్ కుమార్ రెడ్డి మొన్న ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ  జరిగిన ఆస్ట్రేలియాలో వచ్చింది. మెల్ బోర్న్లో టీమిండియాకు అవసరమైన సమయంలో సెంచరీ బాది తన సెలక్షన్ ఎంత విలువైనదో నిరూపించాడు నితీశ్ రెడ్డి. మన దేశంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది NKR కి. అది తిరుమలలో కనిపించింది. కాలినడక మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామి వారిని దర్శించుకున్న నితీశ్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. గుడి ముందు ఉన్నాం అనే సంగతే మర్చిపోయి నితీశ్ తో ఫోటో కోసం ట్రై చేశారు. నితీశ్ ను చాలా ఇబ్బంది పెట్టారు. బట్ అతనికి ఈ క్రేజ్ చాలా కష్టపడితే వచ్చింది. అందుకే చాలా మందికి నవ్వుతూ ఫోటోలు ఇచ్చాడు. ఓటైమ్ లో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయటం అక్కడున్న సిబ్బందికి కష్టం కూడా అయిపోయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola