Nirmala Sitharaman interacts with Students | స్టూడెంట్స్ తో నిర్మలా సీతారామన్ ముచ్చట్లు

 ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోనే ఎడారి ప్రాంతంగా మారనున్న అనంతపుర్ జిల్లాలో పచ్చదనం పెంపొందించి, వర్షపాతాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా  చెట్లు నాటే కార్యక్రమంలో  పిల్లలతో కలిసి మొక్కలు నాటారు కేంద్ర ఆర్థిక మంత్రి   నిర్మల సీతారామన్. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు  చెట్లను పెంచితే జరిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి . విద్యార్థులతో మొక్కలను నాటించారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో  తేమ శాతం తక్కువగా ఉంటుందని, ఇక్కడ తక్కువ నీటిని తీసుకొని  ఏపుగా పెరిగే మొక్కలను  నాటించడం ద్వారా అడవులుగా తయారవుతాయని మంత్రి పిల్లలకు తెలియజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి . అనంతపురం జిల్లాను ఎడారిగా మారకుండా చూసుకోవాలని పిల్లలతో చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్. నాసన్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola