NIA Raids At Anantapur | అనంతపురంలో ఉగ్ర కదలికలు.. NIA సోదాలు | ABP Desam
NIA Raids At Anantapur | అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో NIA సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేశారు. కొందరు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. ఆయన కుమారుల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. అబ్దుల్ కుమారులు కొంతకాలంగా బెంగుళూరులో నివసిస్తున్నారు. అయితే, వారు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. వారికి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయని ఆరోపణలు రావడంతో కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ కుమారుడి ఎస్బీఐ అకౌంట్ కు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ అయ్యినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.