ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన మార్గదర్శకాలను బెజవాడ పోలీసులు జారీ చేశారు.బహిరంగంగా జరిగే వేడులకు అనుమతి లేదన్నారు.అంతర్గతంగా జరిగే వేడుకలకు అనుమతి తప్పని సరి చేశారు.అంతే కాదు 60శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలని చెప్పారు.కోవిడ్ నిబంధనలు పాటించటంతో పాటుగా ఒమిక్రాన్ ప్రమాదాన్ని కూడ గుర్తించి తగిన జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.