Nellore MPTC Polling : నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా మొదలైన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్

నెల్లూరు జిల్లాలో ఎంపీటీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. జిల్లాలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 4 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. కోట మండలంలో కోట ఎంపీటీసీ స్థానానికి, కోవూరు మండలంలోని గంగవరం ఎంపీటీసి స్థానానికి, సైదాపురం మండలంలో అనంతపురం స్థానానికి పోలింగ్ మొదలైంది. మొత్తం 12మంది అభ్యర్థులు ఈ 3 స్థానాలకు పోటీ పడుతున్నారు. కోవూరు మండలం గంగవరంలో ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇక్కడ 1802మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం చిరు జల్లులు పడుతున్నా ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola