కాలేజీకి అనుమతుల్లేవు.. పరీక్షల్లో మాస్ కాపీయింగ్..!
నెల్లూరు జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. వింజమూరులోని శ్రీ సాయి ఒకేషనల్ కాలేజ్, ఉదయగిరి లోని వైఎస్ఆర్ ఒకేషనల్ కాలేజీ, వరికుంటపాడు లోని సాధన ఒకేషనల్ కాలేజీలను... అధికారులు గతంలో తనిఖీలు చేసి వాటి గుర్తింపు రద్దు చేశారు. జిల్లా అధికారుల నివేదిక ప్రకారం ఇంటర్ బోర్డ్ ఈ ఏడాది అక్టోబర్ లో వాటి గుర్తింపు రద్దు చేసింది. అయితే అప్పటికే విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారని, వారి భవిష్యత్తుకు ఇబ్బంది ఏర్పడుతుందని యాజమాన్యాలు కోర్టు కెక్కాయి. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు ఉండగానే వింజమూరులోని సాయి ఒకేషనల్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులకు అర్థసంవత్సర పరీక్షలు నిర్వహిస్తోంది. అవి కూడా చూచి రాత పరీక్షల్లా మారిపోయాయి. పక్కపక్కనే కూర్చున్న విద్యార్థులు పుస్తకాలు చూసి మరీ కాపీ కొడుతున్నారు.