Nellore : ప్రశాంతంగా నగర కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్
Continues below advertisement
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నేటి ఉదయం 8 గంటలకు మొదలైంది. ఉదయాన్నే సిబ్బంది నగరంలోని డీకే డబ్ల్యూ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉండగా, అందులో 8 ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 46 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు నేడు తేలబోతున్నాయి. 600 మంది భద్రతా సిబ్బందితో కౌంటింగ్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ విజయరావు. కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు.
Continues below advertisement