నెల్లూరు జిల్లాలో వరదబాధితుల ఆవేదన..

Continues below advertisement

అర్థరాత్రి చెరువులు కట్టలు తెంచుకుని ఊళ్లపై పడిపోతాయేమోనన్న ఆందోళన.. కళ్లముందే నీరు ఇళ్లలోకి వచ్చి చేరితే.. కట్టుబట్టలతో ఎటు పోవాలో తెలియని ఆవేదన. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. కనీసం పునరావాస కేంద్రాలకు తరలించేవారు కూడా లేరని వాపోతున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో కండలేరు, పిన్నేరు వాగులు ఉప్పొంగడంతో.. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. కలిచేడు, ఎస్టీ కాలనీ, వడ్డిపాలెం, దేవరవేమూరు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరిందని, తమకు ఏ ఆదరణా లేదని వాపోతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram