Chandrababu: చెయ్యేరు నది వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. చెయ్యేరు నది వరద ప్రభావిత ప్రాంతాలైన నందలూరు, రాజంపేట మండలాల్లోని తొగురుపేట, మందపల్లి, పులపత్తురు,గుండ్లురు గ్రామాల్లో పర్యటించనున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి ఎపి సిఎం వైఎస్ జగన్ సొంత జిల్లాకు రానుండటం, తొలిసారి అధినేత జిల్లాకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు కడప ఎయిర్ పోర్టుకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి