CI Nageswaramma: గూడూరు వద్ద హైవేపై ట్రాఫిక్ ని కంట్రోల్ చేసిన మహిళా సీఐ
Continues below advertisement
జోరు వానలో డ్యూటీ చేయాలంటే కాస్త కష్టమైన పనే. అందులోనూ కనీసం కూర్చోడానికి ఏమాత్రం వసతిలేని ప్రాంతం. కానీ అప్రమత్తంగా లేకపోతే వరద నీటిలోకి వెళ్లే వాహనాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అందుకే నెల్లూరు జిల్లా గూటూరు పట్టణ సీఐ నాగేశ్వరమ్మ జోరు వానలో సైతం 24గంటలసేపు నిలబడి డ్యూటీ చేశారు. గూడూరు వద్ద హైవేపై వాహనాలను బ్రిడ్జిపైనుంచి మళ్లించేందుకు సిబ్బందితో కలసి ఆమె అక్కడికి వచ్చారు. హైవేపైనుంచి వెళ్తే వరదనీటికి వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో తాత్కాలికంగా ట్రాఫిక్ ని బ్రిడ్జ్ పైనుంచి మళ్లించారు. బ్రిడ్జ్ పైనుంచి కేవలం వన్ వే కు మాత్రమే అనుమతించారు.
Continues below advertisement