Nara Lokesh TDP BJP Janasena: రెండు కీలకమైన సభల్లో నారా లోకేష్ ఎందుకు కనపడలేదు..? కారణాలేంటి..?
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అందుకే కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ... ప్రచార జోరును పెంచాయి. అందులో పడిన మొట్టమొదటి పెద్ద అడుగు... నిన్న పల్నాడులో నిర్వహించిన భారీ ప్రజాగళం సభ.కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా దగ్గరగా గమనించే చాలా మందిలో నిన్నటి సభ తర్వాత మెదిలిన ప్రశ్న ఒక్కటే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వారసుడిగా భావించే నారా లోకేష్ ఎక్కడా ఎందుకు కనపడలేదని.