Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

Continues below advertisement

 నారా దేవాన్ష్ చెస్ లో అరుదైన రికార్డును సాధించాడు. వరుసగా 175 చెస్ బోర్డ్ లపై ఉన్న చెక్ మేట్స్ ను సాల్వ్ చేసి అత్యంత చిన్న వయస్సులో ఆ ఘనత సాధించిన చెస్ ప్లేయర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. దేవాన్ష్ వయస్సు తొమ్మిది సంవత్సరాలు. చెక్ మేట్ మారథాన్ పేరుతో జరిగిన ఈ పోటీల్లో నారా  దేవాన్ష్ ప్రతిభను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ ప్రతినిధులు రికార్డ్ చేశారు. ఈ రికార్డుతో పాటు మరో రెండు రికార్డులను దేవాన్ష్ కైవసం చేసుకున్నాడు.దేవాన్ష్ సాధిచిన రికార్డును తల్లి తండ్రులు లోకేశ్, బ్రాహ్మణి ట్వీట్స్ ద్వారా తెలిపారు. చిన్నవయస్సులో చెస్ పై తనకున్న ఆసక్తి, పట్టుదలతో దేవాన్ష్ తమను గర్వపడేలా చేశాడని బ్రాహ్మణి లోకేశ్ ట్వీట్ చేశారు. మనవడు సాధించిన విజయంపై తాత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. లిటిల్ గ్రాండ్ మాస్టర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానంటూ మనవడిని ప్రశసించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola