
Nara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam
నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఊరిలో చిన్నపిల్లల కోసం ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. చిన్ననాటి ఊరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు తన మనవళ్లను ఈ ఆటల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. గోని సంచి పరుగుపందెంలో నారా దేవాన్ష్ పాల్గొన్నాడు. దేవాన్ష్ రేసు మొదలుపెట్టినప్పటి నుంచే అతని తల్లి బ్రాహ్మణి దగ్గరుండి అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. ఎలా ఆడాలో సరదాగా సూచనలు ఇచ్చి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.అయితే ఆ ఆటలో పెద్దగా అనుభవం లేకపోవడంతో దేవాన్ష్ చివర్లో నిలిచాడు. రేసు ముగిసిన తరువాత దేవాన్ష్ కాస్త నిరుత్సాహంగా కనిపించినప్పటికీ, బ్రాహ్మణి ఆయనకు ఏం పర్లేదని చెప్పి హైఫై ఇచ్చి ఉత్సాహపరిచారు. ఆ సన్నివేశం చూసి అక్కడున్న అందరూ చిరునవ్వులు చిందించారు. తన మనవడిని ఇలా ఆటల్లో పాల్గొంటూ చూసి చంద్రబాబు ఆనందంతో నిండిపోయారు. పండగ సందర్బంగా పిల్లలు ఇలా ఆడుతూ పాడుతూ గడిపితే నిజమైన పండుగ అనుభూతి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.