Nara Bhuvaneswari: తనకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పిన నారా భువనేశ్వరి
Continues below advertisement
ఆంద్రప్రదేశ్ శాసన సభలో తనపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు ఎన్టీఆర్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. మీ ఇంట్లో వాళ్లకి అవమానం జరిగినట్టు గా భావించి, రియాక్టయిన వారందరికీ కృతజ్ఞతలని చెప్పారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతిఒక్కరు పాటు పడాలని సూచించారు. తనకు జరిగిన అవమానం మరెవరికి జరగకూడదని ఆశిస్తున్నానని చెప్పారు నారా భువనేశ్వరి.
Continues below advertisement