Nandamuri Balakrishna At Vijayawada: అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ
విజయదశమి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రాభివృద్ధి జరిగి ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. మానవశాంతి ఉంటే ప్రపంచ కల్యాణం జరుగుతుందన్నారు