Nadendla Manohar on Govt Advisors : అడ్వైజర్ల కోసం 680కోట్లు ఖర్చుపెట్టారన్న నాదెండ్ల మనోహర్ | ABP
వైసీపీ ప్రభుత్వం నియమించుకున్న సలహాదార్ల జీతభత్యాలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్ హయాంలో 2019నుంచి ఇప్పటివరకు సుమారు 80 నుంచి 90 మంది సలహాదారులు, ఉప సలహాదారులను నియమించారని వీళ్ల కోసం 680కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేశారంటూ నాదెండ్ల సంచలన విషయాలను బయటపెట్టారు.