Murali Naik Final Rituals Army Respect | ముగిసిన అమరవీరుడు మురళీనాయక్ అంత్యక్రియలు | ABP Desam
కుటుంబసభ్యులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య అమరవీరుడు మురళీనాయక్ అంతిమయాత్ర జరిగింది. కశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ పాకిస్థాన్ తూటాలకు బలై..దేశసేవలో ప్రాణాలు త్యజించిన మురళీనాయక్ పార్థివదేహం ఉన్న బాక్సును మంత్రి నారా లోకేశ్ తన భుజంపై మోశారు. సైనికులతో పాటే ఆర్మీ వాహనంలో లోకేశ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ముందుగా సైనిక లాంఛనాలతో మురళీనాయక్ కు కడసారి గౌరవ వందనం చేశారు ఆర్మీ అధికారులు. గాల్లోకి కాల్పులు జరిపి ఫైనల్ రెస్పెక్ట్ ఇచ్చారు. అనంతరం ఏపీ పోలీసులు మురళీ నాయక్ పార్థివదేహానికి గౌరవ వందనం అందించారు. అనంతరం మురళీ నాయక్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. మురళీనాయక్ ను కడసారి చూడాలని భారీగా సత్యసాయి, అనంతపురం జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన యువ దేశభక్తుడిని చూసి చలించిపోతున్నారు. ఇంత చిన్న వయస్సులో అమర వీరుడు అవ్వటంపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఖననం చేసిన ప్రాంతాల్లో జాతీయ జెండాలను గుచ్చుతూ నివాళులు అర్పిస్తున్నారు ప్రజలు.