Muharram Celebration with Knives | వేటకొడవళ్లతో మొహర్రం సంబరాలు
సీమలో వేటకొడవళ్ల సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థుల సంహారం కోసం వేటకొడవళ్లు వాడుతుంటారు. అలాంటిది వందలమంది వందల వేటకొడవళ్లతో కనిపిస్తే అక్కడ రక్తపాతం ఏ రేంజ్ లో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఒక చోట మాత్రం నరికే వేటకొడవళ్లతో నృత్యాలు చేస్తున్నారు. కొడవళ్లతో నరుకుడే కాదు.. నాట్యం కూడా చేస్తామంటున్నారు అక్కడి గ్రామస్థులు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో మోహర్రం వేడుకలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ మోహర్రం వేడుకల్లో ఒక విభన్నమైన సాంప్రాదయం ఉంది. గ్రామంలో పీర్ల ఉరేగింపు సమయంలో యువకులంతా వేటకొడవళ్లు పట్టుకుని డప్పుల శబ్ధాలకు నృత్యాలు చేస్తుంటారు. ఈ మోహర్రం పండుగను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఈ మోహర్రం సాంప్రదాయం వస్తున్నా.. ఎక్కడా చిన్న గొడవ కూడా లేకుండా ఈ సాంప్రదాయం కొనసాగడం విశేషం.