Ananthapuram MPTC Polling : తాడిపత్రి లో రసవత్తరం గా ఎంపీటీసీ ఎన్నికలు
అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గంలో ఉత్కంఠం గా ఎంపీటీసీ ఎన్నికలు మారాయి. ఎంపిటిసి అభ్యర్థులు గా నామినేషన్ వేసిన వారు మృతి చెందడంతో అధికారులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులుగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి,మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి వర్గాల వాళ్ళు వున్నారు. జేసి సోదరుల సొంత గ్రామం జుటూరు కావడంతో ప్రిస్టేజి గా రెండు పార్టీలు తీసుకున్నాయి. గొడవలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.