వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. మేము వెంటే ఉంటాం!

మూడేళ్లుగా జగన్ పరిపాలనతో ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని TDP MP Rammohan Naidu కామెంట్ చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గం వెతుకుతామని చెప్పారు. సీఎంని చేస్తే ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పిన జగన్... ఇంతవరకు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. Cinema Industryని APకి ఆహ్వానించింది చంద్రబాబు.. కానీ జగన్ మాత్రం వైజాగ్ లో ఉన్న Ramanaidu studiosని కూడా లాగేసుకునేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే.. మేమూ రాజీనామాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రామ్మోహన్ పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola