Mopadu Cheruvu: మోపాడు ప్రాజెక్ట్ రక్షణ చర్యలు చేపట్టే వరకు కదిలేది లేదన్న టీడీపీ.|
Continues below advertisement
ప్రకాశం జిల్లా మోపాడు రిజర్వాయర్ వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి స్థానిక ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. రిజర్వాయర్ పరిష్టతకు చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. చేపలను పట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ అధికారులు, అధికార పార్టీ నేతలకు.. ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించారు. ఈ దశలో టీడీపీ నేతల్ని అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేశారు ఎస్సై. అయితే బాధితులకు భరోసా ఇచ్చే వరకు ప్రాజెక్ట్ రక్షణ చర్యలు చేపట్టే వరకు తాము కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Continues below advertisement