Moolapeta Port Ground Report: మూలపేట పోర్టు ఎప్పటికి పూర్తయ్యేను? రైతులకు పరిహారం అందేనా?
ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన మూలపేట పోర్టు పూర్తై, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశపడిన స్థానికులకు ఇంకా నిరాశ తప్పడం లేదు. మూలపేట పోర్టుపై రోజుకో వివాదం చెలరేగుతుండడంతో అసలు పోర్టు ఎప్పటికైనా పూర్తవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బలవంతంగా భూములు లాక్కున్నారని కొందరు రైతులు ఆరోపిస్తుంటే, తమ భూములకు, ఇళ్లకు పరిహారం అందలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు పోర్టు పనులైతే మొదలయ్యాయి కానీ పూర్తవుతుందనే నమ్మకం లేదని రైతులు చెబుతున్నారు.