MLC Thota Trimurthulu Venkatayapalem: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోర్టు తీర్పుపై స్థానికులు ఏమంటున్నారు?
వెంకటాయపాలెం శిరోముండనం కేసుపై ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు నిందితులు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో పాటు తొమ్మిదిమందికి 18 నెలల జైలు, రూ.2లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో శిరోముండనం బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 1996 డిసెంబర్ 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితులైన దళితులు దాదాపు 28 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందంటూ దళితులు తెలిపారు.. అసలు ఆరోజు ఏం జరిగింది.. కోర్టు తీర్పుపై వారేమంటున్నారు..? ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ ఇది.