MLA Pinnelli Ramakrishna Reddy Destroyed EVM | పోలింగ్ రోజు మాచర్ల ఎమ్మెల్యే EVM పగులగొట్టారా? | ABP

పోలింగ్ రోజు మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగులగొట్టారా.? సోషల్ మీడియా ఇప్పుడు ఈ వీడియో తెగవైరల్ అవుతోంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వా గేట్లో ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రం నెంబరు 202 లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా దూసుకొచ్చి ఈవీఎంను పగులగొట్టినట్లు ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఎన్నికల సంఘం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి వివరణా రాలేదు. అసలు స్వయంగా ఎమ్మెల్యేనే ఈవీఎంను పగులగొట్టినట్లు ఇప్పటి వరకూ సమాచారమే బయటకు తెలియలేదు. పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టగానే అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త ఆగ్రహంతో ఎమ్మెల్యేనే కొట్టడానికి వెళ్లాడు. కానీ ఎమ్మెల్యే అనుచరులు అతన్ని నిలువరించారు. ఇంత జరిగినా ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ బీఎల్వో కానీ ఎమ్మెల్యే పిన్నెల్లి మీద కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడా సమాచారమే బయటకు రాలేదు. ఈ విజువల్స్ పోలింగ్ బూత్ వెబ్ క్యాస్టింగ్ విజువల్స్ గా తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola