Miss Vizag Nakshatra Husband Teja News | వేరే మహిళతో భర్త..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య | ABP

Miss Vizag Nakshatra Husband Teja News | భర్త వేరే అమ్మాయితో ఉండగా... భార్య వెళ్లి గుట్టురట్టు చేసింది. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ నక్షత్ర ఆందోళనకు దిగింది.

సినీ పరిశ్రమలో ఉన్న ఓ యువ జంట మధ్య విభేదాలు విశాఖపట్నంలో బయటపడ్డాయి. భర్త పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడని భార్య ఆరోపిస్తూ ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్ గెల్చుకున్న నక్షత్ర అనే మహిళ విశాఖపట్నంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. నక్షత్ర 2017లో వెంటకసాయి తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తమ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉండేవని నక్షత్ర తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola