Minister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP Desam

శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కార్లు వెళ్లేందుకు ఆస్కారం లేని పరిస్థితి ఉంటుంది.. అయితే ఆప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సిన నరిస్థితి కనిపిస్తుంది... అందుకే ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాసమస్యలు అడిగి తెలుసుకునే క్రమంలో వారి వద్దకు వెళ్లేందుకు సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు.. ఇకపై ఇరుకు రోడ్లులోనూ, సందుగొందుల్లోనూ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు ఓ పరిష్కార మార్గాన్ని ఆలోచించారు.. దీంతో వేగంగా ప్రజలవద్దకు వెళ్లడమేకాకుండా సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు..
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్లు కూడా వెళ్లలేని రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలపై వినతులు స్వీకరించేందుకు అందుకు తగిన విధంగా రూకల్పన చేయించుకోవడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ వెనుక భాగం సీటును ప్రత్యేకంగాతయారు చేయించుకుని ఆయన కంఫర్ట్‌గా కూర్చుని వెళ్లేవిధంగా చేయించుకున్నారు మంత్రి అచ్చెన్న.. శ్రీకాకుళం జిల్లాలోని కోటబమ్మాళి, టెక్కలి, నిమ్మాడ తదితర ప్రాంతాలతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన వీధివీధికి తిరిగే విధంగా ఈ వాహనాన్ని తయారు చేయించుకున్నారు.. ప్రస్తుతం ఆయన మన్యం జిల్లా ఇంచార్జ్‌గా ఉండడం వల్ల ఆప్రాంతాలకు నాలుగు చక్రాల వాహనాలు వెళ్లే అవకాశం లేనిప్రాంతాల్లో సైతం ఆయన తిరిగేందుకు ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్‌ అందిస్తారు..

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola