Chiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP Desam

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు కానీ వారు ఎవరు. అలాంటిది చిరుకు ఉన్న లక్షలాది మంది అభిమానులకు దక్కని అవకాశాన్ని దక్కించుకున్నారు తిరుపతికి చెందిన ఈశ్వరయ్య రాయల్. ఈయన ప్రత్యేకత ఏంటనేగా ఈశ్వర్ కు చిరంజీవికి ఎంత అభిమాని అంటే చిరంజీవి కోసం తిరుమలకు పొర్లుదండాలు పెట్టుకుంటూ వెళ్లారీయన. సాధారణంగా తిరుమల మెట్లు ఎక్కి వెళ్లాలంటేనే చాలా చాలా కష్టం. కనీసం నాలుగు గంటలు శ్రమిస్తే కానీ సామాన్యులు పైకి వెళ్లలేని పరిస్థితి. అలాంటిది ఈశ్వరయ్య కాలినడకన నడుచుకుని వెళ్లారంటే ఆయనకు చిరంజీవి అంటే ఎంతటి అభిమానమో ఇట్టే చెప్పొచ్చు. అందుకే చిరునే నేరుగా ఈశ్వర్ ను తన ఇంటికి పిలిపించుకున్నారు. కుటుంబంతో తో సహా ఈశ్వర్ ను కలిసి తనపై చూపించే అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకో రిక్వెస్ట్ ఏం చేశారంటే మరోసారి ఈశ్వర్ ను ఇలాంటి రిస్కులు చేయొద్దని కోరారంట చిరంజీవి. ఆ విశేషాలు చిరంజీవి ఇంటిలో గడిపిన సంగతులను ఏబీపీ దేశంతో షేర్ చేసుకున్నాడు ఈశ్వర్ రాయల్. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola