Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP Desam

 స్నేహితులతో కలిసి సరాదాగా ఎంజాయ్ చేద్దామని మారేడుమిల్లి వెళ్లిన వైద్యవిద్యార్థుల బృందంలో ముగ్గురు మెడికోలు వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోవటం తీవ్ర విషాదాన్ని నింపింది. మారేడుమిల్లిలోని జలతరింగిణిలో స్నానాల కోసం ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న 14మంది వైద్యవిద్యార్థులు వెళ్లారు. వీరు స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా జలతరింగిణి ఉద్ధృతి పెరిగిపోయింది. ఎగువ కురుస్తున్న వర్షానికి ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ లో నీరు వేగంగా వచ్చేయటంతో ఐదుగురు వైద్యవిద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు కాజ్ వే దగ్గర చిక్కుకోవటంతో వారిని మాత్రం స్థానికులు రక్షించగలిగారు. మిగిలిన ముగ్గురు వైద్యవిద్యార్థుల ఆచూకీ తెలియటం లేదు. గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. గల్లంతైన మెడికోలను సౌమ్య, అమృత, హరదీప్ గా గుర్తించారు. ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతైన ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారధి విపత్తు దళాలను హుటాహుటిన మారేడుమిల్లికి పంపించారు. గల్లంతైన వైద్యవిద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు. రక్షించిన ఇద్దరు వైద్యవిద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola